Politics1st Sep 05:06 PMSunil Byrisetty1 min read

రాహుల్ రాజకీయాలకు పనికిరాడు

భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉధ్యమం చేపట్టింది. రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఉండదగ్గ వ్యకి కాదని ఎపి బ

రాహుల్ రాజకీయాలకు పనికిరాడు
భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉధ్యమం చేపట్టింది. రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఉండదగ్గ వ్యకి కాదని ఎపి బిజెపి ఛీఫ్ పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ దేశం మహిళను మాత్రుమూర్తిగా కొలుస్తున్న నేపధ్యంలో బీహార్ ఎన్నికల ప్రచారానికి దిగజారుడు తనాన్ని కాంగ్రెస్ ప్రదర్శిస్తోందన్నారు. సారధ్యం యాత్రలో రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న మాధవ్ రాహుల్ గాంధీ పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడి విమర్శలు చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిదా రాజు విజయవాడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ధగ్ధం చేసిన ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ రిజ్వి నరేంద్ర మోదీని, వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని దేశం మొత్తం ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మహమ్మద్ రిజ్వి వారి పార్టీ నుండి భర్తరఫ్ చెయ్యాలని, రాహుల్ గాంధీ అందరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
BJP Andhra Pradesh
Rahul Gandhi
PVN Madhav
Mahila Morcha Protest
Congress Controversy
Bihar Elections
Rajamahendravaram
Nishida Raju
రాజకీయ విమర్శలు
క్షమాపణ డిమాండ్
Scroll for the next article