Politics29th Sep 06:06 PMSunil Byrisetty1 min read

ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. వెనుక బిజేపి

ప్రధానిగా మోడీ, కేంద్ర మంత్రిగా అమిత్ షా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బిజేపి ఒక్కో రాష్ట్రంలో క్రమంగా అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ

ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. వెనుక బిజేపి
ప్రధానిగా మోడీ, కేంద్ర మంత్రిగా అమిత్ షా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బిజేపి ఒక్కో రాష్ట్రంలో క్రమంగా అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇండి కూటమి కూడా బలహీనపడింది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీలు, ప్రభుత్వాల పతనం, యూపీ, ఎంపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కీలకమైన రాష్ట్రాలు బిజేపి చేతిలోకి వెళ్ళిపోవడంతో ఇండియా కూటమి ఇంకా బలహీనపడింది. అయితే ఇండి కూటమి ఈ బలహీనతే కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశం కావచ్చు. ఇదివరకు ఇండియా కూటమిలో మమతా బెనర్జీతో సహా ఓ అరడజను మంది ప్రధాని అభ్యర్ధులు ఉండేవారు. వారందరినీ బిజేపి రాజకీయంగా దెబ్బ తీసింది. తద్వారా ఇప్పుడా పార్టీలన్నీ రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించక తప్పదు. అంటే ఇండియా కూటమిలో రాహుల్‌ గాంధీకి ఎవరూ పోటీ లేకుండా చేసి బిజేపి మహోపకారం చేసిందని భావించవచ్చు.
Scroll for the next article