News23rd Sep 12:06 PMSunil Byrisetty1 min read

ఏపీలో రైల్వే లైన్ల విస్తరణ?

ఏపీకి కొత్త రైల్వే లైన్లు రాబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ సిద్ధం చ

ఏపీలో రైల్వే లైన్ల విస్తరణ?
ఏపీకి కొత్త రైల్వే లైన్లు రాబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ సిద్ధం చేసే పనిలో ఉంది. ఇది పూర్తి కాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. 11 రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. డిపిఆర్ సిద్ధం చేసే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలుమార్గాల్లో రైళ్ల రద్దీ పెరిగింది. అందుకే ఆయా రూట్లలో అవసరమైన చోట మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. రైల్వే శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1960 కిలోమీటర్ల మేర.. కొత్త ప్రాజెక్టుల డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొండపల్లి నుంచి మైలవరం, తిరువూరు మీదుగా సత్తుపల్లి సమీపంలోని లంకపల్లికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవకాశాలున్నాయి.
Andhra Pradesh
Indian Railways
Railway Expansion
New Railway Lines
Rail Projects
DPR
Infrastructure Development
Kondapalli
Mylavaram
లంకపల్లి
దక్షిణ మధ్య రైల్వే
రవాణా
కనెక్టివిటీ
Scroll for the next article