Notifications28th Aug 11:37 AMSunil Byrisetty1 min read
రైల్వేలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు!
దక్షిణ రైల్వే పరిధిలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్
దక్షిణ రైల్వే పరిధిలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3518 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇంటర్, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. నెలకు రూ. 6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.