News8th Nov 04:32 PMSunil Byrisetty1 min read

కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన!

ఏపీ వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 8, 9 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉం

కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన!
ఏపీ వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 8, 9 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, అప్పుడప్పుడు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరంలో అక్కడక్కడ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణాంధ్ర తీరంలోనూ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ బులెటిన్ వెల్లడించింది. 11న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, నవంబర్ 13 ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD ముందస్తు అంచనా వెల్లడించింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Scroll for the next article