News4th Nov 10:37 AMSunil Byrisetty1 min read
500 ఏళ్ల చరిత్రకు వర్షం దెబ్బ!
చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి మురుసు తుఫాన్ రూపంలో నష్టం వాటిల్లింది. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థాన
చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి మురుసు తుఫాన్ రూపంలో నష్టం వాటిల్లింది. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థాన ప్రాంగణం లోని ప్రహరీ గోడ వర్షాల ప్రభావంతో కూలిపోయింది. ఎన్నో తరాలుగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా ఉన్న ఆలయ ప్రహరీ గోడ కూలిపోవడంతో భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వందల ఏళ్ల చరిత్రను తనలో ఇముడ్చుకున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవస్థానంలో పురాతన నిర్మాణాల పరిరక్షణ అత్యంత కీలకమైన అంశంగా మారింది. మురుసు తుఫాన్ ప్రభావంతో ఆలయ ప్రహరీ గోడ కూలిపోవడం పురాతన నిర్మాణాల పటిష్టతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వర్షపు నీరు గోడ పునాదులపై ప్రభావం చూపిందా? నిర్మాణం బలహీనపడటానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను సంబంధిత అధికారులు సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.