Sports21st Jun 05:13 PMSunil Byrisetty1 min read

ఇంగ్లండ్ తో టెస్టుకు వర్షం బ్రేక్?

ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), యశస్వి జైస్వాల్ (10

ఇంగ్లండ్ తో టెస్టుకు వర్షం బ్రేక్?
ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), యశస్వి జైస్వాల్ (101) అద్భుత శతకాలతో చెలరేగడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్రీజులో గిల్‌తో పాటు రిషభ్ పంత్ (65 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. అయితే, శనివారం (జూన్ 21) రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. రెండో రోజు ఆట సాఫీగా సాగుతుందా లేదా అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Sports news
cricket match
India vs England
test series
Rishabh pant
Shubaman gill
Rain
Leeds
Scroll for the next article