Mobiles12th Jun 02:02 PMSunil Byrisetty1 min read
వానాకాలం.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!
మొబైల్ ఫోన్లోనే అన్నీ చక్కబెట్టేస్తున్న మనకు నీటిలో తడిసినా పని చేసే మొబైల్ చాలా ఉపయోగపడుతుంది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నా
మొబైల్ ఫోన్లోనే అన్నీ చక్కబెట్టేస్తున్న మనకు నీటిలో తడిసినా పని చేసే మొబైల్ చాలా ఉపయోగపడుతుంది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లలో డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 13 5G ఫోన్ 1.5K ఫ్లాట్ OLED కర్వ్డ్ డిస్‌ప్లే 6.59 అంగుళాలు ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 4nm ఆక్టా కోర్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 5800mAh బ్యాటరీ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.