News27th Nov 12:58 PMSunil Byrisetty1 min read
ఉత్సాహంగా "రైతన్న - మీకోసం" కార్యక్రమం
అన్నదాతకు అండగా ఉంటూ.. సాగును లాభసాటిగా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 03 వరకు "రైతన్న - మీకోసం" అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతన్న - మ
అన్నదాతకు అండగా ఉంటూ.. సాగును లాభసాటిగా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 03 వరకు "రైతన్న - మీకోసం" అనే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతన్న - మీకోసం కార్యక్రమం కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రతి రైతు ఇంటిని సందర్శించి, రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, దిగుబడులు, వారి అవసరతల సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతరత అంశాలను ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అధికారుల బృందం వివరిస్తున్నారు. అదేవిధంగా పంచసూత్రాలను సాగులో అమలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులతో చర్చిస్తున్నారు. 2 లక్షల 6 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.273 కోట్ల ఆర్థిక సహాయాన్ని జమ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖను అందజేసి అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందనే భరోసాను కల్పిస్తున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ప్రధానంగా రైతులు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వాడుకోవడం, సమాజంలో మారుతున్న అలవాటులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం, వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలు వినియోగం, వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును రైతులకు వివరిస్తున్నారు.