News21st Apr 04:04 PMSunil Byrisetty1 min read
సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అన్నట్లు చెప
ఏపీ మద్యం కుంభకోణం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అన్నట్లు చెప్పారు.
దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజ్ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
రాజ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
దీంతో ముందస్తు బెయిల్ ఇప్పుడు రాకపోవడంతో సిట్ విచారణకు హాజరు అవ్వాలని రాజ్ కసిరెడ్డి నిర్ణయించుకున్నారు.
సిట్ పోలీసులు నోటీసులకు రెస్పాండ్ అయిన రాజ్ కసిరెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని అధికారులకు సమాచారం అందించారు.
ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.