Technology21st Sep 12:37 PMSunil Byrisetty1 min read
చాట్ జీపీటీకే చెమట్లు పట్టించిన రాజమండ్రి కుర్రాడు
ప్రపంచ ఏఐ రంగాన్ని ఏలుతున్న ఓపెన్ ఏఐ(చాట్ జీపీటీ) భద్రతను ఛేదించి ఔరా అనిపించాడో రాజమండ్రి కుర్రాడు. రాజమహేంద్రవరం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థి.. తన
ప్రపంచ ఏఐ రంగాన్ని ఏలుతున్న ఓపెన్ ఏఐ(చాట్ జీపీటీ) భద్రతను ఛేదించి ఔరా అనిపించాడో రాజమండ్రి కుర్రాడు. రాజమహేంద్రవరం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థి.. తన అపారమైన నైపుణ్యంతో ఓపెన్ ఏఐ సెక్యూరిటీ సిస్టమ్స్‌లోని తీవ్రమైన లోపాలను బయటపెట్టాడు. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతడే రాజానగరం పరిధిలోని సంపత్నగరానికి చెందిన పెదపాటి మోహన్ శ్రీరామకృష్ణ . మోహన్ శ్రీరామకృష్ణ రాజమహేంద్రవరంలోని సంపత్‌నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కెరీర్లో ఎదగలేమనుకునే వారికి మోహన్ సాధించిన విజయం బలమైన సమాధానం. ఆ తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆయన, కోడింగ్, సైబర్ సెక్యూరిటీపై ఉన్న ఆసక్తితో ఎథికల్ హ్యాకింగ్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలికాడు. ఏకంగా చాట్ జీపీటీని షేక్ చేసిన అతడి నైపుణ్యాలకు అంతర్జాతీయ గుర్తింపుతోపాటు ఓపెన్ ఏఐ రివార్డు లభించింది.