Entertainment6th Sep 09:00 AMSunil Byrisetty1 min read
వరల్డ్ రికార్డ్ దిశగా రాజమౌళి!
రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నవాళ్లు రికార్డుల కోసం సిద్దంగా ఉన్నారు. టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఎన్ని ర
రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నవాళ్లు రికార్డుల కోసం సిద్దంగా ఉన్నారు. టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఎన్ని రికార్డులు కనుమరుగు కాబోతున్నాయా అనే ఆసక్తి నెలకొంది. అయితే వీళ్లు కేవలం ఇండియాలో కాక ప్రపంచంలోనే ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. ఇలాంటి రికార్డ్ ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా ఏ సినిమా పరిశ్రమలోనూ లేదు.
ఈ చిత్రాన్ని అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నాడు రాజమౌళి. కొంత మైథలాజికల్ టచ్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీకి సంబంధించి రహస్యంగా ఉంచుతున్నారు. ఇక ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేసి రికార్డు సాధించబోతున్నారు.