News20th Jun 04:44 PMSunil Byrisetty1 min read
ఆ వజ్రం ఆంజనేయుడికే.. భక్తుడి కానుక!
అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి వారి ఆలయ హుండీలో ఓ విలువైన ముడి వజ్రం లభ్యం కావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టిన సందర్భంగా ఈ
అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి వారి ఆలయ హుండీలో ఓ విలువైన ముడి వజ్రం లభ్యం కావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వజ్రంతో పాటు ఓ అజ్ఞాత భక్తుడు రాసిన లేఖ కూడా హుండీలో దొరికింది. హుండీలో కానుకలతో పాటు ఓ చిన్న పర్సులో ఉంచిన వజ్రం, దానికి జత చేసిన ఓ లేఖను అధికారులు గుర్తించారు. ఆ లేఖలో, తనకు ఈ వజ్రం దొరికిందని, దానిని తాను ధరించలేక స్వామివారికి సమర్పిస్తున్నానని సదరు భక్తుడు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇది నిజమైన వజ్రమని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నానని, దీనిని స్వామివారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలలో వినియోగించాలని ఆ భక్తుడు తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అధికారులు ఆ వజ్రాన్ని పరిశీలించగా, అది సుమారు 1.396 క్యారెట్ల బరువున్న ముడి వజ్రమని ప్రాథమికంగా నిర్ధారించారు. భక్తుడి కోరిక మేరకు, ఈ వజ్రాన్ని స్వామివారి కైంకర్యాల నిమిత్తం వినియోగిస్తామని ఆలయ సిబ్బంది తెలిపారు.