News24th Mar 12:42 PMSunil Byrisetty1 min read

ఉగ్రవాదులపై రజినీకాంత్ హెచ్చరిక!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఉగ్రవాదుల గురించి గొంతెత్తారు. ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉ

ఉగ్రవాదులపై రజినీకాంత్ హెచ్చరిక!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఉగ్రవాదుల గురించి గొంతెత్తారు. ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన దేశ కీర్తిని పాడు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా చొరబడి దారుణాలకు తెగబడతారని తెలిపారు. ఈ సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి ఘటనను ఉదహరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. వారు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు స్వాగతించి, కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లి ఉత్సాహం నింపాలని రజనీకాంత్ కోరారు. ఇప్పుడు సామాజిక బాధ్యతతో రజినీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rajinikanth Terrorist
Threat Coastal
Security India
Seaborne Infiltration
CISF
Scroll for the next article