News1st Apr 09:13 AMSunil Byrisetty1 min read

తెల్ల రేషన్ కార్డుందా.. ఈ పథకం మీ కోసమే

తెలంగాణ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభత్వం కీలక పథకం ప్రవేశపెట్టింది. "రాజీవ్ యువ వికాస’’ పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం లేదని ఉపముఖ్యమ

తెల్ల రేషన్ కార్డుందా.. ఈ పథకం మీ కోసమే
తెలంగాణ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభత్వం కీలక పథకం ప్రవేశపెట్టింది. "రాజీవ్ యువ వికాస’’ పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5 కాగా, దరఖాస్తుల స్వీకరణ విషయంలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాస దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క ఓ ప్రకటన జారీ చేశారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి మరో వెసులుబాటును కల్పించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, పురుషులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఇందుకోసం ఆయా కార్పొరేషన్లకు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది సర్కార్. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. అయితే ఒక రేషన్ కార్డు మీద ఒక లబ్దిదారుడు మాత్రమే ఈ పథకాన్ని పొందనున్నారు
Rajiv Yuva Vikasam
Scheme
Tealngana
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెల్ల రేషన్ కార్డు
Scroll for the next article