News28th Jul 04:22 PMSunil Byrisetty1 min read

ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ

ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌ విజయవంతమైందని తెలిపారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని, సైనికుల సత్త

ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ
ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌ విజయవంతమైందని తెలిపారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని, సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని సూచించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి మాటలు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్యం విషయంలో ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. 1962 చైనాతో యుద్ధం సమయంలో.. విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని సూచించారు. సైన్యాన్ని ఆనాడు వాజ్‌పేయి ప్రశంసించారని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు.
India news
Operation Sindhur
Rajnath Singh
Lok Sabha debate
Indian Army
Opposition criticism
Defence Ministry
Parliament 2025
National security
India-China war reference
ఆపరేషన్‌ సింధూర్
రాజ్‌నాథ్‌ సింగ్‌
లోక్‌సభ చర్చ
Scroll for the next article