News11th Sep 01:22 PMSunil Byrisetty1 min read

కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రుల కోసం కేంద్రానికి వినతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్య‌స‌భ‌ ఎంపీ లింగమనేని రమేశ్ వినతినందించారు. కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిం

కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రుల కోసం  కేంద్రానికి వినతి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్య‌స‌భ‌ ఎంపీ లింగమనేని రమేశ్ వినతినందించారు. కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు ఆయన వినతిపత్రం పంపారు. ఈఎస్ఐ పథకం దేశంలోని కార్మికులు, వారి కుటుంబాలకు కీలకమైన సామాజిక భద్రతా వ్యవస్థగా ఉందని, ఉద్యోగుల ఆరోగ్య రక్షణలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు, వారి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఈఎస్ఐ వైద్య మౌలిక వసతులను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు తగిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పలువురు బీమా పొందిన కార్మికులు వైద్యం కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఆయ‌న చెప్పారు.
Andhra Pradesh ESI
Lingamneni Ramesh
Rajya Sabha MP
ESI Hospitals
ESI Scheme
Employees State Insurance
Mansukh Mandaviya
Union Labour Ministry
ఈఎస్ఐ డిస్పెన్సరీలు
కార్మికుల ఆరోగ్యం
సామాజిక భద్రత
ఏపీ కార్మికులు
వైద్య మౌలిక వసతులు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article