National3rd Aug 04:50 PMSunil Byrisetty1 min read
రాజ్యసభలో పెరిగిన బీజేపీ బలం
రాజ్యసభలో బీజేపీ బలం స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం పెరగడం కలిసొచ్చే అంశం కానుంది. ఇటీవల రా
రాజ్యసభలో బీజేపీ బలం స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం పెరగడం కలిసొచ్చే అంశం కానుంది. ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన ముగ్గురు ఎంపీలు ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్ సింగ్ శ్రింగ్లా, సీ సదానందన్ అధికారికంగా బీజేపీలో చేరారు. దీంతో పెద్దల సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 102కి చేరింది.
2022 ఏప్రిల్ తర్వాత బీజేపీ సభ్యుల సంఖ్య రెండోసారి 100 మార్క్ దాటడం విశేషం. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ విజయం ఖాయం అని తెలుస్తోంది.