Entertainment27th Dec 12:54 PMSunil Byrisetty1 min read
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు?
హైదరాబాద్‌లో పట్టుబడిన ఓ డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ
హైదరాబాద్‌లో పట్టుబడిన ఓ డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన క్రమంలో, వారు ముంబైకి చెందిన నైజీరియన్ కార్టెల్ నుండి డ్రగ్స్ సేకరించి హైదరాబాద్‌లోని హై-ప్రొఫైల్ కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలం ప్రకారం, వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉండగా, అందులో ఒకరు హీరోయిన్ సోదరుడిగా గుర్తించారు. నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డెలివరీ చేసే లోపే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న హీరోయిన్ సోదరుడు పరారయ్యాడు.