Entertainment7th Jan 04:54 PMSunil Byrisetty1 min read

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రేతల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు కేసు నమోదైంది. నాటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగుచూసింది. నెల రోజుల్లో అమన్ ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Film Celebrity News
Rakul Preet Singh
Aman Preet Singh
Drug Case
High Court
Hyderabad Drugs Racket
Cocaine
MDMA
Police Investigation
Legal Battle
Scroll for the next article