Politics18th Apr 01:05 PMSunil Byrisetty1 min read

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రామ్ మాధవ్?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ ప్రతి అడుగు హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రధాని మోదీ నాగపూర్లోని రాష్ట్రీయ స్వయంసే

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రామ్ మాధవ్?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ ప్రతి అడుగు హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రధాని మోదీ నాగపూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఆసుపత్రిని ప్రారంభించారు. అంతర్జాతీయ ఉగ్రవాది రాణా అరెస్ట్ అయి భారత్‌కు తరలించబడ్డాడు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమలులోకి రావడం, బంగాల్‌లో నిరసనల పేరుతో దాడులతో ఉద్రిక్తత నెలకొనడం జరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. మరోవైపు దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతికి సంబంధించి జోక్యం చేసుకుంది. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు కాలవ్యవధి ఉండాలనడం సంచలనాత్మకమైంది. ఈ వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. వారం వారం జరగాల్సిన కేబినెట్ రద్దు, ప్రధాని మోదీ జమ్ము పర్యటన చివరి క్షణంలో రద్దులాంటి కీలక పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతితో మోదీ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ నేత బీఎల్ సంతోష్ సమావేశమై, అనంతరం ప్రధానిని కలిశారు. ఈ పరిణామాలన్నింటిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి ముందు రాష్ట్రాల అధ్యక్షుల్లో మార్పులు జరగనున్నాయి. అనంతరం జాతీయ అధ్యక్ష నియామకం జరగనుంది. రేసులో మనోహర్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి తదితరుల పేర్లున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి ఈశాన్య భారతంలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన వ్యూహకర్తగా రామ్ మాధవ్‌కు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ చరిత్రలో ఈ వారం కీలకంగా మారింది.
BJP
Ram Madhav
national president
Modi
భారతీయ జనతా పార్టీ
వక్ఫ్ బోర్డు సవరణ చట్టం
హోంమంత్రి అమిత్ షా
Scroll for the next article