News11th Jan 01:04 PMSunil Byrisetty1 min read
ఉద్యోగాల పేరుతో మయన్మార్లో మోసం.. రామ్మోహన్ చొరవ!
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో.. మయన్మార్ దేశంలో చిక్కుకున్న భాదితులు తిరిగి భారత దేశానికి చేరుకున్నారు. ఉద్యోగ హామీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో.. మయన్మార్ దేశంలో చిక్కుకున్న భాదితులు తిరిగి భారత దేశానికి చేరుకున్నారు. ఉద్యోగ హామీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన సుమారు ఇరవై ఏడు మంది యువకులు కొద్ది నెలల క్రితం మయన్మార్ చేరుకున్నారు. అయితే ఇచ్చిన హామీ ఒకటి వారికి అక్కడ అందుతున్న ఉపాధి మరో రకంగా ఉండేది. మయన్మార్లో తమను బలవంతపు సైబర్ స్కాం, శారీరక దుర్వ్యవహారాలు, ఇతర ఇబ్బందులకు గురి చేసారని తమ కష్టాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వీడియో రూపంలో చేర వేశారు మయన్మార్లో చిక్కుకున్న 27 మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని విదేశాంగ శాఖా మంత్రి డా. జై శంకర్ కు రామ్మోహన్ లేఖ రాసారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ, యాంగోన్‌లోని భారత రాయబారి కార్యాలయం వేగంగా చర్యలు తీసుకుని, శనివారం రోజున భాదితులను సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకొచ్చారు.