News6th Jan 04:10 PMSunil Byrisetty1 min read
మన్సుఖ్ మాండవీయతో రామ్మోహన్ నాయుడు భేటీ
కేంద్ర క్రీడల శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో, శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి తో
కేంద్ర క్రీడల శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో, శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, మైదానాలు, క్రీడాకారుల వసతులు, క్రీడాకారులకు అందాల్సిన గౌరవాలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస రెవెన్యు పరిధిలో ఉన్న 33 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి ఇందులో ప్రముఖంగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లా క్రీడల అధికారుల నుండి వెళ్ళిన స్పోర్ట్స్ సెంటర్స్ ప్రతిపాదనను గుర్తు చేశారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన అంశాలపై మాండవీయ సానుకూలంగా స్పందించారు.