Politics9th Apr 08:46 AMSunil Byrisetty1 min read
జగన్‌కు ఎస్సై మాస్ వార్నింగ్.. అరటి తొక్కేం కాదు!
రాప్తాడు పర్యటనలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్
రాప్తాడు పర్యటనలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ జగన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎస్‌ఐ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు. ‘జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా.
పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.
కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.
మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు.
తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామని సుధాకర్ స్పష్టం చేశారు.
అడ్డదారులు తొక్కబోమని తెలిపారు. జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్ హెచ్చరించారు.
గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని తెలిపారు.