Entertainment7th Nov 03:16 PMSunil Byrisetty1 min read
‘రామాయణ’పై ప్రశంసల వెల్లువ
భారీ అంచనాలతో విడుదలైన ‘రామాయణ’కు దేశవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటిక
భారీ అంచనాలతో విడుదలైన ‘రామాయణ’కు దేశవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా ఓ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని అభివర్ణించగా.. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా స్పందించారు. చిన్నతనంలో విన్న కథలు ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని మహేష్ బాబు ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా రణ్‌బీర్, యశ్, సాయి పల్లవిల పెర్ఫార్మెన్స్ను మహేష్ బాబు ‘మ్యాజికల్’ అంటూ అభివర్ణించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. రాముడు, రావణుడి పాత్రల గొప్పతనాన్ని, వారి స్థాయిని బిగ్ స్క్రీన్‌పై అనుభూతి చెందాలంటే తప్పకుండా ‘రామాయణ’ చూడాలని ప్రేక్షకులను కోరారు.