Crime15th Nov 04:09 PMSunil Byrisetty1 min read

బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై సీఐడీ విచారణకు రానా

ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటులు వరుసగా విచారణకు హాజరవుతున్నారు. తాజాగా ఈ కేసులో సినీ నటుడు రానా సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. రానా ఆర్థిక లావాదేవీలు, ప

బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై సీఐడీ విచారణకు రానా
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటులు వరుసగా విచారణకు హాజరవుతున్నారు. తాజాగా ఈ కేసులో సినీ నటుడు రానా సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. రానా ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ ఒప్పందాలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి తదితర నటులను కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్ అని తమకు తెలియదని నటులంతా చెబుతుండటం గమనార్హం.
Rana Daggubati
CID Investigation
Betting App Case
Telugu Actors
Prakash Raj
Vijay Deverakonda
Manchu Lakshmi
మంచు లక్ష్మి
ప్రమోషన్ వివాదం
సైబర్ క్రైమ్
Scroll for the next article