News8th Dec 04:31 PMSunil Byrisetty1 min read
డిసెంబరు 26న విశాఖ లో రంగా నాడు
వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగా నాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. రాధా రంగా రాయల్ అసోసియేషన్
వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగా నాడు
పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగా నాడు పోస్టర్ ని ఆవిష్కరించారు. రాధా రంగ మిత్ర మండలి సభ్యులు ను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరుతో సభ పెట్టామని, కుల,మత, రాజకీయాకు అతీతంగా జరిగే సభ ఇదని వివరించారు.
చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అని నాన్న రంగా చెప్పేవారని, ఇప్పుడు అదే స్లోగన్ తో రాధారంగ మిత్ర మండలి ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని వివరించారు. రాధారంగా మిత్ర మండలి పెద్దల ఆదేశాలు , సూచనల ప్రకారం నా రాజకీయ నిర్ణయం అప్పుడు ఉంటుందని ఆశా కిరణ్ స్పష్టం చేశారు.