Politics24th Mar 12:37 PMSunil Byrisetty1 min read
టీడీపీలోకి మాజీ జనసేన ఎమ్మెల్యే?
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోలులో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనంతరం వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో విజయం సాధి
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోలులో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనంతరం వైసీపీలో చేరారు.
2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని రాపాక అనంతరం వైసీపీకీ రాజీనామా చేశారు.
గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వరప్రసాద్‌కు ఇప్పుడు ఏ పార్టీలో చేరాలో అర్థం కావడం లేదు.
అయితే ఆయన స్థానికంగా టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో తనకు చాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. గత ఎన్నికల వరకూ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరి, రాజోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరిన రాపాక.. అమలాపురం ఎంపీకి పోటీ చేసి లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఎలాగైనా టీడీపీలో చేరాలనుకుంటున్న వరప్రసాద్ ఆ పార్టీ కీలక నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులను కలిసి టీడీపీలో చేరేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
అయితే కూటమి పార్టీల్లో ఎవరు చేరాలన్నా ఇతర పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి.
దీంతో రాపాక టీడీపీలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాపాక టీడీపీ చేరికకు జనసేన అడ్డుపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.