Politics20th Jun 11:11 AMSunil Byrisetty1 min read

ఏపీ రాజకీయాల్లో పుష్ప.. రప్పా.. రప్పా!

ఏపీ రాజకీయాలను పుష్ప డైలాగ్ కుదిపేస్తోంది. పుష్ప-2 సినిమాలో కథానాయకుడు అల్లు అర్జున్ ‘రప్పా.. రప్పా..’ డైలాగ్‌ సినిమా విడుదల సమయంలో కన్నా ఇప్పుడు వైరల్ అయింది. జగన్ పల్నాడు పర్యటనల

ఏపీ రాజకీయాల్లో పుష్ప.. రప్పా.. రప్పా!
ఏపీ రాజకీయాలను పుష్ప డైలాగ్ కుదిపేస్తోంది. పుష్ప-2 సినిమాలో కథానాయకుడు అల్లు అర్జున్ ‘రప్పా.. రప్పా..’ డైలాగ్‌ సినిమా విడుదల సమయంలో కన్నా ఇప్పుడు వైరల్ అయింది. జగన్ పల్నాడు పర్యటనలో ఒక కార్యకర్త 'అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం' అంటూ ప్రదర్శించిన ప్లకార్డు ఈ అగ్గిని రాజేసింది. దీనిపై జగన్ 'పుష్ప' సినిమాలో డైలాగ్‌ కొట్టడం కూడా తప్పేనా? అంటూ వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు..
Andhra Pradesh news
Ap politics
YSRCP
TDP
Ys Jagan
Cm Chandra Babu
rappa rappa Pushpa2 Dialogue
ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా
Scroll for the next article