News19th Aug 04:02 PMSunil Byrisetty1 min read
తవ్వకాలలో రాగి నాణేలు లభ్యం,..!!
కడప జిల్లాలో అరుదైన రాగి నాణాలు వెలుగుచూశాయి. సిద్ధవటం లోని పెన్నా నది తీర ప్రాంతమున వెలసిన సిద్ధవటేశ్వర శివాలయంలో ధ్వజస్తంభం, తొలగింపు పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా మరో కొన్
కడప జిల్లాలో అరుదైన రాగి నాణాలు వెలుగుచూశాయి. సిద్ధవటం లోని పెన్నా నది తీర ప్రాంతమున వెలసిన సిద్ధవటేశ్వర శివాలయంలో ధ్వజస్తంభం, తొలగింపు పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా మరో కొన్ని పురాతనమైన రాగి నాణేలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఏఈఈ రమేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభం నూతనంగా ఏర్పాటు చేయడం కొరకు రెండో రోజు తవ్వకాలు చేపడుతుండగా కొన్ని రాగి నాణేలు బయటపడ్డాయని తెలిపారు. వాటిని శ్రీశైల దేవస్థానం ట్రస్టుకు అప్పగిస్తామన్నారు. వీటి చరిత్రను గుర్తించే ప్రయత్నం చేస్తామన్నారు.