News14th Sep 11:23 AMSunil Byrisetty1 min read
అరుదైన ఘట్టం.. కలెక్టర్లుగా భార్యాభర్తలు..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కనిపించలేదేమో.. ఒక జిల్లాకు కలెక్టర్‌గా పనిచేయడం ఐఏఎస్ సాధించిన వారికో గొప్పగౌరవం. అయితే.. ఇప్పుడు ఇలా ఐఏఎస్ సాధించి వివిధ హ
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కనిపించలేదేమో.. ఒక జిల్లాకు కలెక్టర్‌గా పనిచేయడం ఐఏఎస్ సాధించిన వారికో గొప్పగౌరవం. అయితే.. ఇప్పుడు ఇలా ఐఏఎస్ సాధించి వివిధ హోదాలో పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ భార్యాభర్తలు.. ఒకే రోజు ఇద్దరూ కలెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేయడం అరుదైన దృశ్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ..ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కానరాలేదు. భార్యాభర్తలు ఐఏఎస్‌లు అయి కలెక్టర్లుగా కొందరు పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఒకే రోజు భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు కలెక్టర్లుగా పదవీస్వీకారం చేయడం మాత్రం అరుదైన సంఘటనే. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్లా పదవీబాధ్యతలు చేపట్టగా ఆయన సతీమణి కృతికా శుక్లా పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లుగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించడంతో వీరిద్దరికీ ఒకేసారి కలెక్టర్లుగా పనిచేసే అరుదైన అవకాశం లభించింది.