News4th Aug 12:39 PMSunil Byrisetty1 min read
కడపలో అరుదైన పంగోలియా జంతువు
కడప జిల్లా కమలాపురంలో అరుదైన పంగోలియా జంతువు కనిపించింది. స్థానికులు జంతువును చూసిన వెంటనే విచిత్రంగా ఉందని, అటవీ శాఖకు సమాచారం అందించారు. పాంగోలిన్ అనగా శరీరమంతా గట్టి పొలుసులు కల
కడప జిల్లా కమలాపురంలో అరుదైన పంగోలియా జంతువు కనిపించింది. స్థానికులు జంతువును చూసిన వెంటనే విచిత్రంగా ఉందని, అటవీ శాఖకు సమాచారం అందించారు. పాంగోలిన్ అనగా శరీరమంతా గట్టి పొలుసులు కలిగిన ఒక అరుదైన క్షీరదం. దీన్ని తెలుగులో 'అలుగు' అని పిలుస్తారు. ఇది చీమలను, చెదపురుగులను తింటుంది, ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణా చేయబడుతున్న జంతువులలో ఇది ఒకటి.పాంగోలిన్ ముఖ్య లక్షణాలేంటంటే శరీరంపై గోళ్లు, వెంట్రుకల లాంటి గట్టి కెరాటిన్ పొలుసులు ఉంటాయి.వీటికి పళ్లు ఉండవు, కానీ పొడవైన నాలుకతో చీమలను తింటాయి.ప్రమాదం ఎదురైనప్పుడు బంతిలా ముడుచుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 రకాల పాంగోలిన్లు ఉన్నాయి (ఆసియాలో 4, ఆఫ్రికాలో 4).వీటిని చంపడం వేటాడటం నేరమని అధికారులు చెబుతున్నారు.