News29th Jul 04:50 PMSunil Byrisetty1 min read

అరుదైన మొక్కకు పవన్ నామకరణం!

కొత్తగా గుర్తించిన ఓ మొక్కకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు పెట్టారు. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కను గుర్తించారు. యూఫోర్బియేసీ

అరుదైన మొక్కకు పవన్ నామకరణం!
కొత్తగా గుర్తించిన ఓ మొక్కకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు పెట్టారు. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కను గుర్తించారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు. అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగి ఉండటం ఈ మొక్క ప్రత్యేకత. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చాటింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Croton Ubbalamadugensis
Rare Plant
New Plant Species
Eastern Ghats
Ubbalamadugu Waterfalls
తిరుపతి జిల్లా
జీవ వైవిధ్యం
వృక్షశాస్త్రం
పర్యావరణ పరిరక్షణ
శాస్త్రీయ పరిశోధనలు
Scroll for the next article