Entertainment3rd Aug 06:01 PMSunil Byrisetty1 min read

పవన్ కల్యాణ్ కి రష్మి వినతి!

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఏపీ ఉపముఖ్యమంత్రికి ఒక వినతి అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎద్దుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దులతో భారీ బరువులు మోయిస్తున

పవన్ కల్యాణ్ కి రష్మి వినతి!
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఏపీ ఉపముఖ్యమంత్రికి ఒక వినతి అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎద్దుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దులతో భారీ బరువులు మోయిస్తున్నారంటూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటువంటి అమానవీయ చర్యలను అరికట్టాలని కోరారు. "పోటీల్లో పాల్గొనేందుకు ఎద్దులకు శిక్షణ ఇవ్వాలని చాలామంది చెబుతుంటారు. అయితే శిక్షణ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఇందులో క్రూరత్వం మీకు కనిపించడం లేదా? అవి కూడా ప్రాణం ఉన్న జీవులే కదా?" అని రష్మీ ప్రశ్నించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. "జంతువులపై జరుగుతున్న ఈ హింసను అరికట్టడంలో మీ సహకారం అత్యవసరం. అనేక సందర్భాల్లో ఇలాంటి ఘటనల వెనుక ప్రభావశీలురు ఉండటంతో మూగజీవాలకు న్యాయం జరగడం కష్టమవుతోంది. ఆలయాల్లో నందులను పూజిస్తూ, బయట వాటిపై ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడటం సరికాదు. ఇది సహాయం కోసం చేస్తున్న ఆర్తనాదం" అని అన్నారు.
Andhra Pradesh
Rashmi Gautam
Pawan Kalyan
Animal Cruelty
Bull Abuse
Animal Welfare
Deputy Chief Minister
Social Media
Bull Training
Animal Rights
Scroll for the next article