Entertainment1st Aug 03:56 PMSunil Byrisetty1 min read
వారి బాటలో రష్మిక.. తాజాగా ప్రమాదం
టాలీవుడ్ నటులను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పవన్ కల్యాణ్, రాంచరణ్, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ వరుసగా గాయాలబారిన పడి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మంద
టాలీవుడ్ నటులను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పవన్ కల్యాణ్, రాంచరణ్, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ వరుసగా గాయాలబారిన పడి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు గాయలయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆమె 'మైసా'లో నటిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'మైసా'కు సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు, అండర్ వాటర్ సీక్వెన్స్‌ను ఇటీవల పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.