News27th May 09:27 AMSunil Byrisetty1 min read
రేషన్ వాహనాల రద్దుపై నిరసన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకంపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల చెంతకు నేరుగా రేషన్ సరుకులు చేర్చే ఈ పథకం కింద సుమారు 9600 వాహనాలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకంపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రజల చెంతకు నేరుగా రేషన్ సరుకులు చేర్చే ఈ పథకం కింద సుమారు 9600 వాహనాలు కొనుగోలు చేసి, ఆయా ప్రాంతాల్లో నియమించిన ఆపరేటర్ల ద్వారా సరఫరా చేయబడుతూ వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను సమీక్షించి, ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆపరేటర్లు రోడ్డెక్కుతున్నారు. వివిధ జిల్లాలో నిరసనలు చేపడుతున్నారు.
అమలాపురంలో రేషన్ వాహనాల ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.
ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.