News1st Sep 03:43 PMSunil Byrisetty1 min read
రేషన్ లో గోధుమ పిండి
రేషన్ సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
రేషన్ సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇక వచ్చే నెల నుంచి రేషన్ లో గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ లబ్దిదారులకు అనుకూలంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల పని వేళల పైన మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఉచిత బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకునేలా వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రేషన్ షాపులు నెల మొత్తం తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రేషన్ దుకాణాలు 365 రోజులూ తెరిచే ఉంటాయని, ప్రజలు తీరిక ఉన్న సమయం లోనో లేదా అవసరమైన వేళ సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు.