News29th Jul 03:12 PMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్ కృషితో రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా రాయలసీమ
జాతీయ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోం
జాతీయ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024ని ప్రకటించి, అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు గత రెండేళ్లుగా విద్య,ఐటి,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే రాయలసీమలో రెన్యూపవర్, SAEL మెగా సోలార్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన మంత్రి లోకేష్... రేపు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ చేయబోతున్నారు. టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ఆధ్వర్యాన రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పత్తికొండలో మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు.