News14th Oct 04:48 PMSunil Byrisetty1 min read
హంద్రీనీవాతో రాయలసీమకు జలసిరి
హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని మొత్తం 517 చెరువులకు గాను 299 చెరువులని కృష్ణాజలాలతో నింపామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రీ నీవా నీరుతో చెరు
హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని మొత్తం 517 చెరువులకు గాను 299 చెరువులని కృష్ణాజలాలతో నింపామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రీ నీవా నీరుతో చెరువులు నింపే కార్యక్రమానికి సంబంధించి కర్నూలు ఇరిగేషన్ సిఈ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారాయన. హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు సకాలంలో పూర్తి చేసిన అధికారులను అందరినీ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. చివరన ఉన్న కుప్పం వరకు కృష్ణాజలాలు తరలి వెళ్ళడంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమకు గుండెకాయ అయిన హంద్రీనీవా ప్రాజెక్ట్ ని గత ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ఆటకెక్కించింది అన్నారు. ఆ ప్రభుత్వం ఐదేళ్లలో చేయనిది, కూటమి ప్రభుత్వం సంవత్సరంలో చేసి చూపించిందని రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్ని 961 టిఎంసిల సామర్థ్యం ఉంటే 844 టీఎంసీలతో వాటిని నింపగలిగామన్నారు. అంటే 87.86% నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు.