News22nd Dec 12:22 PMSunil Byrisetty1 min read

గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలం

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన ఎనర్జీ ఎగ

గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలం
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్‌కు హాజరైన మంత్రి, విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా మంత్రికి వివరించారు. విద్యార్థుల్లో కనిపించిన సృజనాత్మకతను మంత్రి ప్రశంసిస్తూ, భవిష్యత్తు ఇంధన రంగానికి ఇవి దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు. ఎగ్జిబిషన్ సందర్భంగా పీఎం సూర్యఘర్, కుసుమ్, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కట్టుబడి ఉందని, కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంధన రంగంలో నూతన ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.
Andhra Pradesh
Green Energy
Rayalaseema
National Energy Conservation Week
Energy Minister Gottipati Ravi Kumar
Tirupati
APSPDCL
Energy Exhibition
Student Innovations
ఏపీఎస్పీడీసీఎల్
ఎనర్జీ ఎగ్జిబిషన్
విద్యార్థుల ఆవిష్కరణలు
పునరుత్పాదక ఇంధనం
Scroll for the next article