Politics13th Jul 05:23 PMSunil Byrisetty1 min read

రేవంత్ రెడ్డి హామీ మేరకే రాయలసీమ లిఫ్ట్‌ నిలిపివేత

నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం అనంత‌రం వైయ‌స్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట

రేవంత్ రెడ్డి హామీ మేరకే రాయలసీమ లిఫ్ట్‌ నిలిపివేత
నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం అనంత‌రం వైయ‌స్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కేటాయించిన 101 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే అవకాశాన్నే దెబ్బతీస్తోందని చెప్పారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, తెలంగాణ భారీ ఎత్తున నీటి వినియోగంతో రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. రూ.900 కోట్లకు పైగా బిల్లులు చెల్లించి, కాలువలు–సివిల్ పనులు పూర్తి చేసి, పంపులు బిగించాల్సిన దశలో ప్రభుత్వం మారిందని చెప్పారు. పంపులు, మోటార్లకు ఆర్డర్లు ఇచ్చినా కొత్త ప్రభుత్వం ప్రాజెక్టును కొనసాగించలేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇచ్చిన హామీ మేరకే ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపివేశారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Scheme
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu Naidu
Revanth Reddy
కృష్ణా జలాలు
రాయలసీమ
నెల్లూరు
సాగునీటి ప్రాజెక్టు
Scroll for the next article