News19th May 04:58 PMSunil Byrisetty1 min read

మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోను: శైలజ

రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి. రాయపాటి శైలజ అన్నారు.

మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోను: శైలజ
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి. రాయపాటి శైలజ అన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గత ఐదేళ్లలో మహిళా కమిషన్‌లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదుల దుమ్ముదులిపి ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్ట్‌లు పెడుతున్నారని, వారు తీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని శైలజ హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మహిళలపట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.
Andhra Pradesh
Rayapati Sailaja
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
మహిళకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు
మహిళలపట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు
Scroll for the next article