Business Type26th Oct 11:30 AMSunil Byrisetty1 min read

వెండిపై రుణాలు.. ఆర్బీఐ నిర్ణయం!

బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోక

వెండిపై రుణాలు.. ఆర్బీఐ నిర్ణయం!
బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే.
RBI
Reserve Bank of India
Silver Loans
Financial Guidelines
NBFCs
Commercial Banks
Silver Jewellery
Silver Coins
Loan Policy
Precious Metals
Banking Regulations
April 1 Implementation
Scroll for the next article