News5th Dec 11:26 AMSunil Byrisetty1 min read
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గుడ్ న్యూస్
వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ.. మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చ
వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ.. మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు మల్హోత్రా వెల్లడించారు. వడ్డీ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణ గ్రహీతలకు మరికొంత ఉపశమనం లభించినట్లయ్యింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది.