News6th Aug 04:44 PMSunil Byrisetty1 min read

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలకు కొత్త రూల్స్

చాలా మంది తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంచుకుంటారు. ముఖ్యంగా సాధారణ బ్యాంకుల కంటే కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వైపు మొగ్గు చూపే వ

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలకు కొత్త రూల్స్
చాలా మంది తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంచుకుంటారు. ముఖ్యంగా సాధారణ బ్యాంకుల కంటే కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, వీటిలో డబ్బులు దాచే డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు పారదర్శకత పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ క్రమబద్ధమైన, బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల వివరాలను ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఒకే రోజున, ఒకే కాలపరిమితికి సమానమైన సొమ్ము డిపాజిట్ చేస్తే.. ఆ బ్యాంక్ ఏ శాఖలోనైనా అందరికీ ఒకే వడ్డీ రేటు లభిస్తుంది. "కొత్త ఆర్బీఐ నియమాలు డిపాజిటర్లకు పూర్తి స్థాయి పారదర్శకతను అందించడమే కాకుండా, విభిన్న బ్యాంకుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచుతాయి" అని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
India finance
RBI
Reserve Bank of India
Small Finance Banks
Fixed Deposits
FD Rules
Deposits
Interest Rates
బ్యాంకింగ్
ఆర్థిక వార్తలు
ఆర్బీఐ మార్గదర్శకాలు
అక్టోబర్ 1
డిపాజిటర్లు
పారదర్శకత
భారత్
Scroll for the next article