Politics7th Mar 06:53 PMSunil Byrisetty1 min read

అప్పుల ఊబిలో ఏపీ.. ఆర్బీఐ కీలక నివేదిక!

దేశంలో పలు రాష్ట్రాలు అప్పు ఊబిలో కూరుకుపోతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగినట్లు తెలిపింది. ద

అప్పుల ఊబిలో ఏపీ.. ఆర్బీఐ కీలక నివేదిక!
దేశంలో పలు రాష్ట్రాలు అప్పు ఊబిలో కూరుకుపోతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగినట్లు తెలిపింది. దేశంలో భారీ అప్పులతో టాప్‌ -10 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. 2019 సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు రూ. 47.9 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు రూ.83.3 లక్షల కోట్లకు పెరిగాయి. 2024లో భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు రూ. 8.3 లక్షల కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో రూ. 7.7 లక్షల కోట్లతో ఉత్తరప్రదేశ్ ఉంది.రూ. 7.2 లక్షల కోట్ల అప్పులతో మహారాష్ట్ర మూడో స్థానంలో, రూ. 6.6 లక్షల కోట్ల అప్పులతో నాల్గవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. రూ. 6 లక్షల కోట్లతో కర్ణాటక ఐదవ స్థానంలో, రూ. 5.6 లక్షల కోట్లతో ఆరో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రూ. 4.9 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది.
AP Debts
India
Andhra Pradesh
RBI
ఎపి అప్పులు
భారతదేశం
ఆంధ్రప్రదేశ్
ఆర్‌బిఐ
Scroll for the next article