National18th Jul 01:31 PMSunil Byrisetty1 min read
పేపర్ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ!
దేశంలో ప్లాస్టిక్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ కరెన్సీని దేశీయంగానే తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొత్త నోట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీ
దేశంలో ప్లాస్టిక్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ కరెన్సీని దేశీయంగానే తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొత్త నోట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకు రానుంది. దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద మార్పులకు ఆర్బీఐ పునాది వేస్తోంది. సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ నోట్లను తీసుకురానుంది. దేశంలో నోట్ల ముద్రణ సంస్థల్లో ఒకటైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో పాలిమర్ సబ్స్టేట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రపంచ వ్యాప్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈఐఓ) జారీ చేసింది.