News9th Apr 12:21 PMSunil Byrisetty1 min read
ఆర్బీఐ తీపి కబురు.. రెపో రేట్లు తగ్గింపు
దేశ ప్రజలకు భారత రిజర్వ్ బ్యాంకు మరోమారు తీపి కబురు చెప్పింది. గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక
దేశ ప్రజలకు భారత రిజర్వ్ బ్యాంకు మరోమారు తీపి కబురు చెప్పింది.
గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెపో రేటును గతంలో 0.25 శాతం తగ్గించిన సెంట్రల్ బ్యాంకు.. మరోసారి 0.25 శాతం మేర తగ్గించింది.
తాజా తగ్గింపు తర్వాత రెపో రేటు 6 శాతానికి పరిమితమైంది.
తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు భారీగానే తగ్గే అవకాశాలున్నట్లు సమాచారం.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 8 శాతం కంటే దిగి వస్తాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
అదే సమయంలో సాధారణ రుణాల వడ్దీ రేట్లలోనూ తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
3 నెలల క్రితం శక్తికాంత దాస్ స్థానంలో రాజీవ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
వచ్చీ రావడంతోనే తన తొలి త్రైమాసికంలోనే రెపో రేటును 0.25 తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది