News25th Nov 11:34 AMSunil Byrisetty1 min read
ఈఎంఐలు తగ్గేలా వడ్డీ రేట్ల తగ్గింపు!
వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెపో రేటు కోతకు పరిస్
వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెపో రేటు కోతకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కీలక సంకేతాలిచ్చారు. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలోనే భవిష్యత్ రేట్ల కోతపై సూచనలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ తర్వాత వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు కూడా సానుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతం వద్ద రికార్డు కనిష్టానికి చేరడం రేట్ల తగ్గింపునకు మార్గం సుగమం చేస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, వినియోగ వస్తువులపై పన్నుల కోత వంటివి ఇందుకు దోహదపడ్డాయి. 2025 ప్రథమార్ధంలో ఎంపీసీ రెపో రేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ఒకవేళ డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే అది 5.25 శాతానికి చేరుతుంది. అదే జరిగితే గృహ, వాహన, ఇతర రుణాలపై ఈఎంఐల భారం గణనీయంగా తగ్గుతుంది.