News6th Jun 01:00 PMSunil Byrisetty1 min read
బెంగళూరు తొక్కిసలాట.. రంగంలోకి సిట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటపై పరిణామాలు వేగవంతమయ్యాయి.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కోసం హైక
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటపై పరిణామాలు వేగవంతమయ్యాయి.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. దీంతో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను అరెస్టు చేశారు. నిఖిల్‌తో పాటు ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ర్యాలీపై చేసిన ప్రకటనలే ఈ దుర్ఘటనకు కారణమంటూ చర్చలు మొదలు కావడం, అందరినీ ఏకకాలంలో అనుమతించటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు సాక్షులు చెబుతున్నారు. కర్ణాటక హైకోర్టు ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు చోటుచేసుకున్నాయి.